విరిగిన ఎముకలను స్వీయ కణాలతోనే అతికించే ఒక బ్యాండేజీని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రకృతిసిద్ధమైన ఉపశమన ప్రక్రియలకు ఇది ఊతమిస్తుందని వారు చెప్పారు. శరీరంలో కలిసిపోయే బ్యాండేజీలు, ఇంప్లాంట్ పూతలు, ఎముక గ్రాస్టు, మెరుగైన ఉపకరణాలకు మార్గం సుగమం చేస్తుందని వివరించారు. క్యాల్షియం ఫాస్పేట్లో తయారైన రసాయనాలకు ఎముక మరమ్మతు, పునరుత్తేజం కలిగించే లక్షణాలు ఉన్నాయని ఇప్పటికే పరిశోధనలో తేలింది.
మన ఎముకకు మన కణంతో చికిత్స