మహిళలపై నేరాల కేసుల్లో 76 మంది MP, MLAలు


 దేశంలో 76 మంది MP లు, MLA లు.. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. ఈ కేసులున్న వారి సంఖ్య BJP (27)లో ఎక్కువగా ఉండగా తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్(16), వైకాపా 7)లు ఉన్నాయి. గత ఐదేళ్లలో (2014-2019) జరిగిన ఎన్నికల్లో.. అన్ని పార్టీల్లో, అన్ని రాష్ట్రాల్లో కలిపి స్వతంత్రులతో సహా ఇలాంటి కేసులున్న ఎంపీలు, ఎమ్మెల్యేల గణాంకాలను ADR వెల్లడించింది.