మహిళ కడుపులో 759 కణితులు

 



 కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ కడుపులోంచి 759 కణితులను వైద్యులు తొలగించారు. ఈ ఘటన చెన్నైలోని సవీతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. దీనిపై ఆస్పత్రి జనరల్ సర్జన్ డాక్టర్ బీవీ సుందరవదనన్ మాట్లాడుతూ... నాలుగున్నర గంటలకు పైగా జరిగిన అతి క్లిష్టమైన శస్త్ర చికిత్స ద్వారా చాలా జాగ్రత్తగా వివిధ పరిమాణాల్లో ఉన్న మొత్తం 759 కణితులను తొలగించాం" అని ఆయన వివరించారు.