రిహార్సల్ విజయవంతం


 శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి 48 ద్వారా రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ (రీశాట్-2బీఆర్/) ఉపగ్రహాన్ని బుధవారం నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సోమవారం నిర్వహించిన రిహార్సల్ విజయవంతంగా ముగిసింది. మంగళవారం సాయంత్రం 4.25కు 23 గంటల కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.