రాజధానికి వెళ్లాలంటే ఎడారిలోకి వెళ్తున్నట్టుంది


 AP రాజధాని అమరావతి పై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానికి వెళ్లాలంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళ్తున్నట్టుగా ఉందని ఆయన అన్నారు. రాజధాని నాది అని ప్రజలు భావించాలి. కానీ అమరావతిలో అది నాకు కనిపించలేదని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు ,విమర్శలు చేస్తున్న వారు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు.