నగరానికి వచ్చిన యూరోపియన్ జర్నలిస్టుల బృందం


రాష్ట్రంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పథకాలను అధ్యయనం చేసేందుకు సెంట్రల్ యూరోపియన్ దేశాలకు చెందిన జర్నలిస్టుల బృందం నేడు నగరానికి చేరుకుంది. పోలాండ్, హంగేరి, క్రోషియా, బల్గేరియా దేశాల నుంచి పలువురు జర్నలిస్టులు, ఎడిటర్లు ఈ బృందంలో ఉన్నారు. ఈ బృందానికి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి విజయ్ గోపాల్, విదేశీ వ్యవహారాలశాఖ, పబ్లిసిటీ సెక్రటరీ ఫకృద్దీన్ అహ్మద్ వీరికి స్వాగతం పలికారు.