గాయాలను నయం చేసుకునే కృత్రిమ చర్మం


 అత్యాధునిక బయో మెడికల్ పరికరాలు, భవిష్యత్తు తరం సాఫ్ట్ రోబోల తయారీలో కీలకంగా మారనున్న సరికొత్త కృత్రిమ చర్మాన్ని ఆస్ట్రేలియన్ నేషనల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు సృష్టించారు. సహజసిద్ధ మానవ చర్మం, కండరాల తరహాలో మన్నిక, దృఢత్వాన్ని అది కలిగి ఉంటుంది. జెల్లీ ఫిష్, వీనస్ ఫై ట్రాప్ వంటి జీవుల ప్రేరణతో అభివృద్ధి చేసిన జెల్లీ వంటి హైడ్రోజెల్ పదార్థంతో ఈ చర్మాన్ని తయారుచేసినట్లు పరిశోధకులు తెలిపారు.