పసిడి.. మళ్లీ రూ. 39వేల పైనే..


 డిమాండ్ లేమితో ఇటీవల కాస్త దిగొచ్చిన బంగారం ధర.. మళ్లీ పెరిగింది. నేడు రూ. 332 పెరగడంతో మరోసారి పసిడి రూ. 39వేల మార్క్ దాటింది. దేశ రాజధానిలో నేడు 10 గ్రాముల పసిడి ధర రూ. 39,299 పలికింది. అటు వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. నేడు ఒక్కరోజే రూ. 676 పెరగడంతో బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 46,672కు చేరింది.