ఆంగ్లం బాగా మాట్లాడే దేశాల్లో భారత్ ది 34వ స్థానం


మాతృభాష ఇంగ్లిషు కానప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లభాషను విస్తృతంగా మాట్లాడే దేశాల్లో నెదర్లాండ్స్ అగ్రస్థానంలో నిలవగా భారత్ 34వ స్థానంలో నిలిచింది. ఆంగ్లేతర మాతృభాషను కలిగిన దేశాల్లో ఇంగ్లీషు బాగా మాట్లాడే ప్రజల సంఖ్య ప్రాతిపదికన రూపొందించిన "ఆంగ్లభాషా ప్రావీణ్య సూచీ-2019' ప్రకారం స్వీడన్ రెండోస్థానంలో ఉంది. నార్వే మూడో స్థానంలో నిలిచింది.