ఆంధ్రప్రదేశ్ కు రూ.33,923 కోట్లు ఇచ్చాం


 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలుకు రెవెన్యూ లోటు భర్తీ, మిగిలిన నిధులతో సహా ఇప్పటివరకు రూ.33,923.0/ కోట్లు విడుదల చేశామని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ వెల్లడించారు. బుందేల్‌ఖండ్, కేబీకే ప్యాకేజీలను పరిశీలించిన తర్వాతే నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ. 2,100కోట్ల ఆర్థిక సాయం అందించాలని సిఫారసు చేసిందని ఆయన అన్నారు.