నిర్ణయాత్మక మూడో టీ20 నేడే


 రసవత్తరంగా సాగుతున్న భారత్-వెస్టిండీస్ టీ20 పోరు క్లైమాక్స్ కు చేరుకుంది. మూడు టీ20ల సిరీస్లో తలో మ్యాచ్ నెగ్గగా.. బుధవారం నిర్ణయాత్మక మూడో టీ20 ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. తొలి మ్యాచ్ లో కష్టం మీద గెలిచి.. రెండో మ్యా చ్ షాక్ తిన్న టీమ్ ఇండియా.. సిరీస్ సాధించాలంటే కష్టపడాల్సిందే. ముఖ్యంగా విండీస్ బ్యాట్స్మ న్ నుంచి బౌలర్లకు ముప్పు తప్పదు.