ఉప్పల్ లో తొలి టీ20 మ్యాచ్...


 క్రికెట్ అభిమానులు ఉప్పల్ స్టేడియంలో పెద్ద సంఖ్యలో ఐపీఎల్ మ్యాచు చూశారు. కానీ ఈ మైదానంలో ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగలేదు. సరిగ్గా రెండేళ్ల క్రితం భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగాల్సి ఉన్నా... అంతకు ముందునుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టాస్ వేయాల్సిన అవసరం కూడా లేకుండానే ఆ మ్యాచ్ రద్దయింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఇప్పటి వరకు 6 వన్డేలు, 5 టెస్టులకు ఆతిథ్యం ఇచ్చింది.