కొన్ని సంవత్సరాలుగా కొత్త దర్శకులకు అవకాశాన్ని ఇస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన తాజాగా మాస్, కమర్షియల్ అంశాలతో ఓ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు 'తలైవర్ 168' అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. కీర్తి సురేష్ ఇందులో నటించనున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతినాయకుడిగా ప్రకాశ్ రాజ్, మీనా, ఖుష్బూ, సూరి వంటి వారు చేరడం విశేషం.
నేడు తలైవర్ 168 ప్రారంభం