137 కిలోల ఎర్రచందనం స్వాధీనం


 హైదరాబాద్ లోని ఎల్బీనగర్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 137 కిలోల ఎర్రచందనం దుంగలను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఆపరేషన్స్ టీం, ఎల్బీ నగర్ జోన్, రాచకొండ, హయత్ నగర్ పోలీసులు కలిసి అంతరాష్ట్ర ఎర్రచందనం అక్రమ రవాణా రాకెట్టును ఛేదించారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.