చలికాలం లో ఈ దుంప్పలు ఎంతో మేలు


చిలగడదుంప.. ఎంతో టేస్టీగా ఉండే ఇవి అంతే ఆరోగ్యాన్ని ఇస్తాయి. తక్కువ ధరకు సులభంగా అందుబాటులో ఉండే వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కూడా. అవేంటో చూద్దాం..



*ఈ దుంపల్లో బీటా కేరోటిన్, విటమిన్ ఈ, సీ, బీ 6, పొటాషియం, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎక్కువగా మేలు చేస్తాయి. ఇందులో ముఖ్యంగా గ్లైకెమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.


* ఈ దుంపల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి చలికాలంలో తినడం వల్ల ఆ సీజన్‌లో వచ్చే జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఎందుకంటే విటమిన్ సి అనేది జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరంచేస్తుంది. దీనిని తినడం వల్ల తక్షణ శక్తి కూడా మీ సొంతం అవుతుంది.



*ఈ దుంపల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. హార్ట్ బీట్‌ని సరి చేసేందుకు సాయపడుతుంది. వీటిని తినడం వల్ల శరీరంలోని కండరాల, నరాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇందులోని మెగ్నీషియం కూడా గుండె ధమనులకు చాలా మంచిది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలకు అలసట నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. చిలగడదుంపల్లోని ప్రత్యేక గుణాలు ఏమైనా గాయాలు అయినప్పుడు వాటిని త్వరగా తగ్గించేలా చేస్తాయి.