నాడీకణాల క్షీణత ఫలితంగా వచ్చే అల్జీమర్స్, గుండె వైఫల్యం వంటి వ్యాధులను నయం చేసే వైద్య పరికరాల ఆవిష్కరణ దిశగా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ నాడీకణాలను అభివృద్ధి చేశారు. సిలికాన్ చిట్లపై ఉండే ఈ నాడీకణాలు అచ్చం సహజసిద్ధ నాడీకణాల్లా పనిచేస్తాయి. నాడీ వ్యవస్థ నుంచి అందే ఎలక్ట్రికల్ సంకేతాలకు స్పందిస్తాయి. కృత్రిమ నాడీకణాలు తమ విధులను నిర్వర్తించగలవు.
వచ్చేశాయ్ కృత్రిమ నాడీకణాలు