నేతితో మిరియాలను వేయించుకుని పొడి చేసుకుని తింటే గొంతు బాధలు తగ్గుతాయి. తీవ్రమైన జలుబుకు, దగ్గుకు మిరియాల చారుకి మించిన గొప్ప వైద్యం లేదు. గొంతు నొప్పికి మిరియాల వైద్యం ఉపకరిస్తుంది. ఉప్పుతో పాటు వామును కూడా మిరియాలలో కలిపి పొడి చేసుకుని తీసుకుంటే గొంతులో వచ్చే బాధ తగ్గిపోతుంది. మిరియాలు, వెల్లుల్లిని నీటిలో వేసి బాగా ఉడికించుకుని ఆ నీటిలో తేనె కలుపుకుని, అప్పుడప్పుడు తాగుతుంటే వేడి తగ్గుతుంది. అజీర్ణ వ్యాధితో బాధపడేవారికి కూడా మిరియాలు ఎంతో మేలు చేస్తాయి.