భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(243), రహనే (86), పూజార(54) పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో జడేజా (60), ఉమేష్ యాదవ్ (25) పరుగులతో ఆడుతున్నారు. భారత్ బంగ్లాదేశ్ పై 343 పరుగుల ఆధిక్యంలో ఉంది. బంగ్లాదేశ్ బౌలర్లలో అబు జాయెద్ 4 వికెట్లు పడగొట్టగా, ఇబాదత్ హొసైన్, మెహిదీ హసన్ చెరో వికెట్ తీసుకున్నారు.
ముగిసిన రెండో రోజు ఆట...