కెనడా కొత్త క్యాబినెట్ లో తొలి హిందూ మంత్రి


 కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన కొత్త మంత్రి వర్గాన్ని వెల్లడించారు. ఈ మంత్రి వర్గంలో తొలిసారి అనితా ఇందిరా ఆనంద్ అనే హిందూ మహిళకు స్థానం దక్కింది. ఈ మంత్రి వర్గంలో మరో ముగ్గురు భారత్-కెనడా సంతతికి చెందిన మంత్రులు ఉన్నారు. వారంతా సిక్కులు. వీరు గత క్యాబినెట్ లో కూడా సభ్యులుగా ఉన్నారు. మంత్రివర్గంలో ఆమెకు ప్రజా సేవల శాఖను కేటాయించారు. పార్లమెంటు ఎన్నికైన తొలి హిందూ మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించారు.