ఫ్లై ఓవర్ ప్రమాదంపై కమిటీ ఏర్పాటు


 గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ప్లై ఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలంటూ ముగ్గురు సభ్యులతో మంత్రి KTR కమిటీని నియమించారు. చీఫ్ ఇంజినీర్ శ్రీధర్ తో పాటు లీ అసోసియేట్స్ ప్రైవేట్ సంస్థతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఫ్లై ఓవర్ డిజైన్, ప్రమాద నివారణ చర్యలపై నివేదిక ఇవ్వాలని కమిటీని KTR ఆదేశించారు.