ఆర్టీసీపై CM కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్, RTC అధికారులు పాల్గొన్నారు. సోమవారం హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూలు కింద ఉన్న APSRTC ని విభజించుకున్నామని, ప్రస్తుతం TSRTC అస్తిత్వంలోనే ఉందని KCR కు అధికారులు వివరించారు. రోడ్డు రవాణా చట్టం-1950లోని సెక్షన్ 3 ప్రకారమే TSRTCని ఏర్పాటు చేసుకున్నామని, దీనికి ఎలాంటి ఆటంకాలూ లేవని స్పష్టం చేశారు.
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష