అధిక ధరలకు అమ్ముతుంటే ఏం చేస్తున్నారు?


 రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు (యూనిఫామ్) విక్రయిస్తుంటే మీరేం చేస్తున్నారని విద్యాశాఖ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారమై ఏమి చర్యలు తీసుకున్నారో వివరణ ఇస్తూ ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్, రాష్ట్రంలోని వివిధ జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.