చిట్టచివరి సుమత్రన్ ఖడ్గమృగం మృతి


మలేసియాలోని సుమత్రన్ ఖడ్గమృగం జాతి అంతరించిపోయింది. ఈ మేరకు బోర్నియో ద్వీపంలోని సబాహ్ రాష్ట్రంలో ఉన్న చిట్టచివరి ఖడ్గమృగం 'ఇమాన్' క్యాన్సర్‌తో బాధపడుతూ మరణించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. 25 ఏళ్ల వయసున్న ఈ ప్రాణి మూత్రాశయ ప్రాంతంలో క్యాన్సర్ కణతులు పెరిగిపోవడంతో మరణించిందని వివరించారు.