అవకాశాల్ని అందుకోవడంలో జోరు ప్రదర్శిస్తోంది పూజా హెర్డే. ప్రస్తుతం అల్లు అర్జున్, ప్రభాస్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె తదుపరి 'పింక్' తెలుగు రీమేక్ లో మెరవనుందని సమాచారం. హిందీలో విజయవంతమైన 'పింక్' చిత్రాన్ని దిల్ రాజు, బోనీకపూర్ కలిసి తెలుగులో పవన్ తో రీమేక్ చేయబోతున్నారు. హిందీలో తాప్సి పోషించిన పాత్ర కోసం పూజాహెగ్లేని సంప్రదించగా, ఆమె పచ్చజెండా ఊపినట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తారు. న్యాయస్థానం నేపథ్యంలో సాగే కథ ఇది.
పింక్ రీమేక్ లో హీరోయిన్ గా పూజా హెగ్గే