ఒకవైపు రైతులు, మరోవైపు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రం 'ఆత్మహత్యల తెలంగాణ'గా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. స్వరాష్ట్రం వస్తే ఆత్మహత్యలు ఉండవని CM కేసీఆర్ చెప్పారని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విమర్శించారు. 39 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె కొనసాగడం ఇదే తొలిసారని.. సమ్మె ఎప్పటికి ముగుస్తుందో తెలియడం లేదన్నారు. ఉద్యమాలకు రాష్ట్రంలో విలువలేకుండా పోయిందని జగ్గారెడ్డి ఆక్షేపించారు.
ఆత్మహత్యల రాష్ట్రంగా తెలంగాణ: జగ్గారెడ్డి