బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించిన భారత్


ఇండోర్ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా జట్టు 213 పరుగులకే కుప్పకూలింది. దీంతో 130 పరుగులతో ఇన్నింగ్స్ విజయాన్ని కోహ్లిసేన సొంతం చేసుకుంది. బంగ్లా ఆటగాళ్లలో ముష్పీకర్ రహీమ్ ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో షమి 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, ఉమేశ్ 2 వికెట్లు, ఇషాంత్ ఒక వికెట్ దక్కించుకున్నారు.