వరుణ్ కోసం నిర్మాతగా?


 ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి త్వరలోనే నిర్మాతగా మారుతున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన రెండు కథల్ని సిద్ధం చేసి, పట్టాలెక్కించడానికి సమాయత్తం అవుతున్నారట. ఈ చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే సురేందర్ రెడ్డినే అందించనున్నారని తెలుస్తోంది. దర్శకత్వ బాధ్యతల్ని తన శిష్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఓ కథలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదో యాక్షన్ ఎంటర్టైనర్ అని, కథలో మలుపులు ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తోంది.