మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ అనూహ్యంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ పంపినట్టు వెల్లడి కావడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం నిన్న శివసేనకు అవకాశమిచ్చిన గవర్నర్.. నేడు ఎన్సీపీని ఆహ్వానించారు. NCP తన నిర్ణయాన్ని వెల్లడించడానికి రాత్రి 8.30 గంటలవరకు గడువు కూడా ఇచ్చారు. ఆ గడువు ముగియకముందే గవర్నర్ అనూహ్యంగా రాష్ట్రపతి పాలనకు నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.
శివసేనకు షాకిచ్చిన గవర్నర్..!