ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

 



 TRS పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి KTR అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన భేటీకి పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు KTR దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై భేటీలో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులపై పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.