కార్మికుల హక్కులను అణచి వేస్తున్న ప్రభుత్వం : భట్టి


ప్రజల భావ వ్యక్తీకరణను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అణచివేస్తుందని CLP నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో కనీస హక్కులు లేకుండా చేస్తుందని, రాష్ట్రంలో ఏ చిన్న ఉద్యమ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ నాయకుల ఇళ్లను దిగ్బంధనం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను అణచి వేసే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని, సహించేది లేదని వ్యాఖ్యానించారు. RTC కార్మికులు 'చలో ట్యాంక్ బండ్' సందర్భంగా చేసిన అరెస్టులు, లాఠీ ఛార్జీలను తీవ్రంగా ఖండించారు.