మహేశ్ బాబు కుమార్తె సితార వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. అయితే, సితార తెరపై కనిపించదు వినిపిస్తుంది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించిన చిత్రం 'ఫ్రోజెన్-2'. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చిన్నప్పటి ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్ చెప్పనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఆ పాత్రకు మహేశ్ కుమార్తె డబ్బింగ్