డెంగీ పై యుద్ధానికి దోమల సైన్యం

 



డెంగీ నియంత్రణ చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శ్రీకారం చుట్టింది. దోమల ఉత్పత్తికి బ్రేక్ వేసేందుకు రంగం సిద్ధం చేసింది. రేడియేషన్ ద్వారా పునరుత్పత్తి లేని మగ దోమలను ఉత్పత్తి చేసి, వాటిని ఆడ దోమలపైకి వదలడం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవాలనేది దీని ఉద్దేశం. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలకమైన నివేదిక విడుదల చేసిందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అంటే జన్యుమార్పిడి దోమలను ఉత్పత్తి చేయడం ద్వారా, క్రమంగా దోమలన్నింటినీ నిర్మూలించాలనేది దీని ఉద్దేశమని ఆ వర్గాలు విశ్లేషించాయి.