సముద్రాల్లోని టెలికాం కేబుళ్లతో ముందే తెలిసే భూకంప ముప్పు


 టెలీ కమ్యూనికేషన్స్ నెట్ వర్క్ లో భాగంగా సముద్ర అంతర్భాగంలో ఏర్పాటుచేసిన ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు భూకంపాలను ముందే గుర్తించడంలో దోహదపడతాయని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో భూకంప ముప్పును పసిగట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు అవి ఉపయోగపడతాయని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన బృందం వెల్లడించింది.