వాట్సాప్ గ్రూప్' ప్రవేశం ఇక మీ ఇష్టమే!


 ఎవరెవరు మిమ్మల్ని వాట్సప్ గ్రూపు లోకి చేర్చవచ్చన్నది నిర్ణయించే అధికారాన్ని ఆ యాప్ ఇక మీకే ఇచ్చింది. గ్రూపుల్లో చేరే విషయంలో ఇప్పటివరకూ ఉన్న నోబడీ' ఆప్షన్ స్థానంలో 'మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్' అనే అంశాన్ని చేర్చింది. దీనిలోకి వెళ్తే అన్ని కాంటాక్టులను లేదా ప్రత్యేకంగా కొన్ని కాంటాక్టులను మినహాయించుకునే సౌలభ్యం ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్లు తప్పనిసరిగా మిమ్మల్ని బృందంలో చేర్చాలని భావిస్తే... వ్యక్తిగత చాట్ విండోలో ప్రత్యేకంగా ఆహ్వానించాల్సిందే