ఆ రైళ్లలో భోజనం ధరలు పెరిగాయి

 



 రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహారం ధరల పెంపుపై IRCTC కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్ ప్రెస్ రైళ్లలో భోజనం ధరలను పెంచుతున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు ఈ రైళ్లలో మొదటి ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ప్రయాణించే వారు ఒక కప్పు టీకి ₹35 రూపాయలు, అల్పాహారం కోసం ₹/40, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంపైన రూ.245 చెల్లించాల్సి ఉంటుందని IRCTC తెలిపింది.