చిదంబరం కు బెయిల్ నిరాకరించిన హైకోర్టు


కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి INX మీడియా కేసులో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్ట్ తోసిపుచ్చింది. ఆయనపై ఆరోపణల తీవ్రత దృష్ట్యా బెయిల్ నిరాకరిస్తున్నట్టు కోర్టు తెలిపింది. INX మీడియా కేసులో ఆయన చురుకైన, కీలక పాత్ర పోషించినట్టు జస్టిస్ సురేష్ కుమార్ కెయిత్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చిదంబరం తీహార్ జైలులో వున్నారు.