'గీత గోవిందం'తో రూ. వంద కోట్ల విజయాన్ని అందుకున్న దర్శకుడు పరశురామ్. ఆ సినిమా విడుదలై ఏడాది దాటేసినా పరశురామ్ నుంచి కొత్త కబుర్లేం వినిపించలేదు. ఇటీవలే పరశురామ్ అటు ప్రభాస్ కి, ఇటు నాగచైతన్యకు కొత్త కథలు చెప్పారని సమాచారం. పరశురామ్ చెప్పిన కథ నాగచైతన్యకు బాగా నచ్చిందట. ప్రభాస్ కూడా పరశురామ్ సినిమా చేయడానికి సన్నద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. అయితే ముందుగా చైతూ సినిమాయే పట్టాలెక్కే అవకాశం ఉంది.