నిరంతర వరద వల్లే ఇసుక సమస్య: జగన్


 రాష్ట్రంలో ఇసుక కొరత తాత్కాలిక సమస్య అని, నవంబర్ నెలాఖరులోగా ఈ సమస్య తీరుందని భావిస్తున్నట్లు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన రహదారులు, భవనాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక కొరతపై స్పందించారు. తాము పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తున్నామని చెప్పారు. నిరంతర వరద వల్ల ఇసుక సమస్య వస్తోందన్నారు.