మంచులేని ఆర్కిటిక్


 ఆర్కిటిక్ వృత్తంలో భారీగా సాగర మంచు ఫలకం ఉంది. ఇది చాలా కీలకం. ఎందుకంటే అది సూర్యకాంతిని ఎక్కువగా పరావర్తనం చెందించి, భూమిపై వేడిని తగ్గిస్తుంది. సెప్టెంబరులో ఐస్ పరిమాణం తగ్గుదల విషయానికి వస్తే అది దశాబ్దానికి 13 శాతం చొప్పున క్షీణిస్తున్నట్లు తేలింది. ఈ లెక్కన 2044 నుంచి 2067 మధ్యకాలంలో ఏటా సెప్టెంబరులో మంచు జాడలేని పరిస్థితి తలెత్తుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల ఆర్థికంగా, పర్యావరణపరంగా నష్టాలు పెరుగుతాయని చెప్పారు.