ఈ టాయిలెట్లు మూత్ర పరీక్ష చేస్తాయి!

 


 


మూత్ర పరీక్ష కోసం ప్రయోగశాలలకు వెళ్లాల్సిన అవసరం భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ పరీక్షను నిర్వహించే స్మార్ట్ టాయిలెట్లను మోర్‌ గ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ప్రాథమికంగా రూపొందించారు. వ్యక్తుల శరీర జీవక్రియల స్థితిగతులకు సంబంధించిన వివరాలను ఈ టాయిలెట్ల ద్వారా తెలుసుకోవచ్చట! దీనికి సంబంధించిన వివరాలను నేచర్ డిజిటల్ పత్రిక ప్రచురించింది.