గురుగ్రహ చందమామ 'యూరోపా పై దట్టమైన మంచు ఫలకం దిగువన ద్రవరూప మహాసముద్రం ఉందన్న సిద్ధాంతాన్ని బలపర్చే ఆధారాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా శాస్త్రవేత్తలు సేకరించారు. యూరోపా ఉపరితలంపై నీటి ఆవిరిని తొలిసారిగా గుర్తించారు. హవాయిలోని డబ్ల్యూ.ఎం.కెక్ అబ్జర్వేటరీ ద్వారా జరిపిన పరిశోధనలతో ఆ నీటి ఆవిరి ఉనికిని నిర్ధారించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు సెకనుకు 2,360 కిలోల చొప్పున యూరోపా నుంచి నీటి ఆవిరి వాతావరణంలోకి ప్రవేశిస్తున్నట్లు తేలిందన్నారు.
గురుగ్రహ చందమామపై నీటి ఆవిరి