ప్రయాణికులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. పరిమితమైన కాల వ్యవధిలో రూ. 8,490 ప్రారంభ ధర (అన్నీ కలుపుకొని)తో విదేశీ విమాన ప్రయాణానికి టిక్కెట్లను విక్రయించనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్ల కింద తీసుకున్న టిక్కెట్లతో ఈ నెల 13 నుంచి 2020 ఏప్రిల్ 15 వరకు ఈ టికెట్లతో ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తోంది. అయితే, నవంబర్ 17 వరకే ఈ టిక్కెట్లను విక్రయించనున్నట్టు ఆ సంస్థ వెబ్ సైట్ లో పేర్కొంది.
ఇండిగో విమానయాన సంస్థ కొత్త ఆఫర్