స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశవాళీ క్రికెటర్ చిదంబరం మురళీధరన్ గౌతమ్ ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక ప్రీమియర్ లీగ్ లో ఫిక్సింగ్ కు పాల్పడిన ఆరోపణలపై గౌతమ్ ను బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు సహచర క్రికెటర్ అబ్రార్ కాజీను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక ప్రీమియర్ లీగ్ బల్లారి టస్కరు ప్రాతినిథ్యం వహించిన వీరిద్దరిపై ఫిక్సింగ్ ఆరోపణలు చుట్టుముట్టాయి. దాంతో గౌతమ్, కాజీలను క్రైమ్ బ్రాంచ్ విభాగం అదుపులోకి తీసుకుంది.
క్రికెటర్ గౌతమ్ అరెస్ట్