ఉప్పునీటి నుంచి తాగునీరు

 


 


నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కోవడంలో మానవాళికి దోహదపడగల సాంకేతికతను భారత సంతతికి చెందిన బ్రిటన్ శాస్త్రవేత్త రాహుల్ నాయర్ ఆవిష్కరించారు. గ్రాఫీన్-ఆక్సైడ్ పొరతో ఆయన ఉప్పునీటి నుంచి ఉప్పును వేరు చేశారు. తద్వారా ఆ నీటిని తాగునీటిగా మార్చారు. ఉప్పునీటి నుంచి ఉప్పుతోపాటు ప్రమాదకర బ్యా క్టీరియా, వైరస్, ఇతర హానికర రసాయనాలను తొలగించగల సామర్థ్యాలనూ ఈ సాంకేతికతకు జోడించనున్నట్లు నాయర్ తెలిపారు.