కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి పూజల్లో పాల్గొంటున్నారు. కార్తీక దీపాలు వెలిగించి, శివుడికి అభిషేకం చేస్తున్నారు. జిల్లాలోని పిల్లలమర్రి, మట్టపల్లి, మెల్లచెర్వు, నాగులపహడ్ శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.