బ్రిటన్ నూతన స్పీకర్ గా లిండ్సే హోయల్!

 



బ్రిటన్ పార్లమెంట్ నూతన స్పీకర్ గా లిండ్సే హోయల్ ఎన్నికయ్యారు. జాన్ బెర్కో రాజీనామాతో నిర్వహించిన ఎన్నికల్లో 540 మందిలో 325 మంది ఎంపీలు లిండ్సేకు మద్దతుగా ఓట్లు వేశారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ కామను 158వ స్పీకర్‌గా ప్రముఖ లేబర్ పార్టీ శాసనసభ్యుడు లిండ్సే హోయల్ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికలో లిండ్సేకే మద్దతు పలికారు ఎంపీలు. జాన్ బెర్కో స్థానాన్ని లిండ్సే భర్తీ చేయనున్నారు. లిండ్సే హోయల్. గత 22 ఏండ్లుగా ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.