రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయపై ఓ ఆగంతకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తనపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో సిబ్బందికి కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు .