ఆ దేవుణ్నే అడగండి


 ఇన్ఫోసిస్ ఆదాయాలు, మార్జిన్లను పెంచి చూపించారంటూ 'ప్రజావేగులు' లేదా 'నైతిక ఉద్యోగులు చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని సెబీ ఛైర్మన్ అజయ్ త్యాగీ వెల్లడించారు. అందువల్ల ప్రస్తుతం ఆ ఆరోపణలపై తాను మాట్లాడానికి ఏమీ లేదని తెలిపారు. అయితే కంపెనీ గణాంకాలను మార్చడం ఆ దేవుడి వల్ల కూడా కాదంటూ ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని చేసిన వ్యాఖ్యలపై ఆయనను అభిప్రాయం కోరగా.. ఈ విషయంపై ఆ దేవుణ్ని లేదంటే ఆయననే అడగమని త్యాగీ అన్నారు.