అమెరికా చికెన్ పై తగ్గనున్న దిగుమతి సుంకం

 



 అమెరికా నుంచి దిగుమతి అయ్యే కోడి మాంసంపై దిగుమతి సుంకాన్ని భారత్ తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతమున్న 100 శాతం పన్నును 30 శాతానికి తగ్గించే ఒప్పందం తుది దశలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అమెరికాలో కోడి మాంసానికి గిరాకీ ఎక్కువ. అయితే అమెరికన్లు లెగ్ పీసులను ఇష్టపడరు. దీంతో అవి ఇష్టపడే భారత్ వంటి దేశాలకు ఎగుమతి చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది.