ఆపిల్ ఐఫోన్ వినియోగదారులకు శుభవార్త. ఆపిల్ సంస్థ త్వరలో ఐఫోన్లను అద్దెకు ఇచ్చే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఐఫోన్లను అద్దెకు తీసుకునేవారు నెల నెలా ఐక్లౌడ్, ఐట్యూన్స్ వంటి సర్వీసులకు కూడా అద్దె చెల్లించేలా ఆపిల్ ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తుందని సమాచారం. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఇప్పటికే ఈ విషయంపై సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే ఐఫోన్ల రెంటల్ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
త్వరలో ఐఫోన్లను అద్దెకు ఇవ్వనున్న ఆపిల్.....?